Texas floods : అగ్ర రాజ్యం అమెరికా (US) లోని టెక్సాస్ (Texas) రాష్ట్రాన్ని వరదలు (Floods) ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అక్కడి నదులు (Rivers) పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలు, వరదల వల్ల 51 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 15 మంది చిన్నారులు ఉన్నారు.
వరదల్లో చిక్కుకున్న 200 మందికిపైగా పౌరులను సహాయక బృందాలు రక్షించాయి. మరోవైపు కెర్ కౌంటీలోని గ్వాడలూప్ నది ఉప్పొంగి సమీపంలోని మిస్టిక్ క్యాంప్ వేసవి శిక్షణా శిబిరాన్ని ముంచెత్తింది. దాంతో ఆ శిబిరంలోని 23 మంది అమ్మాయిలు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా గాలిస్తున్నారు.