Nayanthara | ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రముఖ సెలబ్రెటీలు విడాకుల వార్తలతో హాట్ టాపిక్ అవుతున్నారు. ఎప్పుడు ఎవరు ఎలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంటారోనని అభిమానుల్లో, సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లేడీ సూపర్‌స్టార్ నయనతార ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు పెద్ద దుమారాన్ని రేపింది. “ఓ తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు.. ఆ పెళ్లి ఓ పెద్ద తప్పిదంగా మారుతుంది. భర్త చేసే తప్పులకు భార్య ఎందుకు బాధ్యత వహించాలి? మగవాళ్లు సహజంగానే పరిణితి చెంది ఉండరు. నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను చాలా అనుభవించాను…” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. నయనతార ఆ పోస్టును క్షణాల్లోనే తొలగించినా, స్క్రీన్షాట్లు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ పోస్టుతో నయనతార-విఘ్నేష్ శివన్ జంట మధ్య విభేదాలు తలెత్తాయన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. “వీరిద్దరూ విడిపోతున్నారా?” అనే ప్రశ్నలు నెటిజన్ల మదిలో మెదులుతున్నాయి. ఇటీవలి రోజులలో ఈ జంట మధ్య దూరం కనిపిస్తోంది అని కొందరు అభిప్రాయపడ్డారు. కట్ చేస్తే నయనతార తన భర్త పిల్లలతో కలిసి పళని స్వామి ఆలయంలో ప్రత్యక్షం అయింది. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. సాష్టాంగ నమస్కారాలు చేశారు. భార్య, భర్తలు ఇద్దరు ఎంతో క్లోజ్‌గా కనిపించడంతో వారి విడాకుల రూమర్స్‌కి చెక్ పెట్టినట్టు అయింది.
ఇక నయనతార కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె చిరంజీవితో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటించారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. సంక్రాంతికి ఈ మూవీ విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు. మరోవైపు యష్ నటిస్తున్న “టాక్సిక్”లో నటిస్తున్నారు. అలాగే మన్నన్‌గట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, మూకుతి అమ్మన్ 2, పెట్రియాట్, హాయ్, రక్కాయే వంటి చిత్రాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి.