Weather Report | నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సారి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైనప్పటికీ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరికొన్ని గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
రానున్న 24 గంటల్లో దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక గుజరాత్ రాష్ట్రంలో శుక్ర, శని వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒడిశా, చత్తీస్ గఢ్, కోస్తా కర్ణాటక, కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi), ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. ఢిల్లీలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 26.5 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి. ఈ సీజన్ లో ఇది సగటు ఉష్ణోగ్రతల కంటే తక్కువ.
మరోవైపు ముంబైలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. దాదర్, మహిమ్, ఖార్, మాతుంగా, కుర్లా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. గోవాలో రానున్న కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మరోవైపు కేరళ (Kerala) రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పోటెత్తిన వరదలవల్ల ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రాంతాలు నీట మునగడంతో ఆయా ప్రాంతాల జనాన్ని రెస్క్యూ టీమ్‌లు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. ఈ మేరకు ఇడుక్కి, కాసర్ గఢ్, కన్నూర్ సహా మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
06 July 2023: #Weather Warning
Source: @IndiametdeptHeavy to very heavy rainfall with extremely heavy falls likely at isolated places over #Konkan & #Goa,
Madhya #Maharashtra; heavy to very heavy rainfall likely at isolated places over #Odisha, pic.twitter.com/jBx7hdvexj— NDMA India | राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण 🇮🇳 (@ndmaindia) July 6, 2023
Rainfall (in cm) recorded over Maharashtra during past 24 hours:
Heavy to very heavy rainfall observed over Konkan & Goa, Madhya Maharashtra and Marathawada.— India Meteorological Department (@Indiametdept) July 6, 2023
Also Read..
Earthquake | ఐస్లాండ్ లో ఒక్కరోజే 1600 భూకంపాలు.. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగే అవకాశం
Urinated | ఆదివాసీపై మూత్ర విసర్జన.. బాధితుడి కాళ్లు కడిగిన సీఎం చౌహాన్
Elon Musk | ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్ యాప్.. ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే..