Elon Musk | ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్ యాప్.. ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే..
Elon Musk | ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (Meta) కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో తీసుకొచ్చిన టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదరులకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు.
Elon Musk | ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (Meta) కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో తీసుకొచ్చిన టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదరులకు అందుబాటులోకి వచ్చింది.
ట్విట్టర్ కు పోటీగా తీసుకొచ్చిన ఈ యాప్ పై కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘థ్రెడ్స్’ యాప్ ను తీసుకొచ్చేందుకు మెటా కేవలం కీబోర్డులోని Crl+C+V (కాపీ పేస్ట్) కీలను మాత్రమే వినియోగించిందంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. దీనికి ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్‌కు పోటీగా ఇటీవల మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) కొత్త యాప్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెటా కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ‘థ్రెడ్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఇందులో ఖాతాలు తెరవగా.. తొలి నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు పెరిగింది. ఈ విషయాన్ని మెటా సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించారు. మెటా తీసుకొచ్చిన ఈ కొత్త ‘థ్రెడ్స్’ యాప్ ను ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను వినియోగించి లాగిన్ చేసుకోవచ్చు. ఇందులో సుమారు వర్డ్స్‌తో లింక్స్, ఫొటోలు, ఐదు నిమిషాల నిడివిగల వీడియోలను సైతం పోస్ట్ చేసుకోవచ్చు.
😂
— Elon Musk (@elonmusk) July 6, 2023
Also Read..
Mark Zuckerberg | ట్విట్టర్ లోకి జుకర్ బర్గ్ రీ ఎంట్రీ.. 11 ఏళ్ల తర్వాత తొలి పోస్ట్
Toxic Gas | ఘోర ప్రమాదం.. విషవాయువు లీకై 16 మంది మృతి
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

