Mark Zuckerberg | ట్విట్టర్ లోకి జుకర్ బర్గ్ రీ ఎంట్రీ.. 11 ఏళ్ల తర్వాత తొలి పోస్ట్
Mark Zuckerberg | ప్రముఖ సామాజికమాధ్యమం ఫేస్ బుక్ ఫౌండర్, మెటా సీఈవో (Meta CEO) మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) 11 ఏళ్ల తర్వాత మళ్లీ ట్విట్టర్ (Twitter) లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్ కు పోటీగా ‘థ్రెడ్స్’(Threads) యాప్ ను తీసుకొచ్చిన సందర్భంగా జుకర్ బర్గ్ ట్విట్టర్ లో ఈ ఉదయం ఓ ఫొటో షేర్ చేశారు.
Mark Zuckerberg | ప్రముఖ సామాజికమాధ్యమం ఫేస్ బుక్ ఫౌండర్, మెటా సీఈవో (Meta CEO) మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) 11 ఏళ్ల తర్వాత మళ్లీ ట్విట్టర్ (Twitter) లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్ కు పోటీగా ‘థ్రెడ్స్’(Threads) యాప్ ను తీసుకొచ్చిన సందర్భంగా జుకర్ బర్గ్ ట్విట్టర్ లో ఈ ఉదయం ఓ ఫొటో షేర్ చేశారు.
స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించిన వ్యకి అదే దుస్తులు ధరించిన మరొక వ్యక్తిని చూపుతున్నట్టు ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు. ఇది 1967లో వచ్చిన స్పైడర్ మ్యాన్ కార్టూన్ ‘డబుల్ ఐడెంటిటీ’లోనిది. విలన్ హీరోగా కనిపించేందుకు ప్రయత్నించేలా ఆ చిత్రం ఉంది. అయితే కేవలం కార్టూన్ ఫొటోను మాత్రమే షేర్ చేసిన జుకర్ బర్గ్.. దానికి ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు. ట్విట్టర్ అధినేత మస్క్ ను ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, 2012 జవనరి 18న జుకర్ బర్గ్ చివరి సారిగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన మైక్రోబ్లాగింగ్ సైట్ లో ట్వీట్ చేయడం ఇదే మొదటిసారి.
ఇదిలా ఉండగా.. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్‌కు పోటీగా ఇటీవల మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కొత్త యాప్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెటా కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ‘థ్రెడ్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఇందులో ఖాతాలు తెరవగా.. తొలి నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు పెరిగింది. ఈ విషయాన్ని మెటా సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించారు.
మెటా తీసుకొచ్చిన ఈ కొత్త ‘థ్రెడ్స్’ యాప్ ను ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను వినియోగించి లాగిన్ చేసుకోవచ్చు. ఇందులో సుమారు వర్డ్స్‌తో లింక్స్, ఫొటోలు, ఐదు నిమిషాల నిడివిగల వీడియోలను సైతం పోస్ట్ చేసుకోవచ్చు.
— Mark Zuckerberg (@finkd) July 6, 2023
Also Read..
Toxic Gas | ఘోర ప్రమాదం.. విషవాయువు లీకై 16 మంది మృతి
Threads App | థ్రెడ్స్ యాప్ భారీగా రెస్పాన్స్..! కొద్దిగంటల్లోనే 2 మిలియన్స్ డౌన్లోడ్స్..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

