security guard rapes student | పీజీ హాస్టల్లో నివసిస్తున్న విద్యార్థిని.. మెడకు వైరు చుట్టి సెక్యూరిటీ గార్డు అత్యాచారం
security guard rapes student | ఒక విద్యార్థిని పీజీ వసతి గృహంలో నివసిస్తున్నది. రాత్రి వేళ వాకింగ్ కోసం టెర్రస్‌పైకి ఆమె వెళ్లింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఆ యువతి మెడకు వైరు బిగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పారిపోయిన ఆ నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
గాంధీనగర్: ఒక విద్యార్థిని పీజీ వసతి గృహంలో నివసిస్తున్నది. రాత్రి వేళ వాకింగ్ కోసం టెర్రస్‌పైకి ఆమె వెళ్లింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు ఆ యువతి మెడకు వైరు బిగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పారిపోయిన ఆ నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. (security guard rapes student) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక యువతి ఇంటీరియర్ డిజైనింగ్ చదువుతున్నది. ఆనంద్‌నగర్ ప్రాంతంలోని పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో ఆమె నివసిస్తున్నది.
కాగా, ఆగస్ట్ 8న డిన్నర్ తర్వాత వాకింగ్ కోసం రాత్రి 10 గంటల సమయంలో హాస్టల్ బిల్డింగ్ టెర్రస్‌పైకి ఆ యువతి వెళ్లింది. అక్కడ సెక్యూరిటీ గార్డు ఉండటంతో కిందకు వచ్చేందుకు ఆమె ప్రయత్నించింది. అయితే సెక్యూరిటీ గార్డు ఆ మహిళ మెడకు వైరు చుట్టి బంధించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. గాయాలతో ఉన్న ఆ యువతిని గుర్తించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. పీజీ హాస్టల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ధరమ్ సింగ్‌ను నిందితుడిగా గుర్తించారు. శనివారం రాత్రంగా వెతికిన పోలీసులు చివరకు ఆదివారం ఉదయం అతడ్ని అరెస్ట్ చేశారు.
నిందితుడు ధరమ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాకు చెందిన వ్యక్తిని అని పోలీస్ అధికారి తెలిపారు. కొద్ది రోజుల కిందటే ఆ పీజీ హాస్టల్లో సెక్యూరిటీ గార్డుగా అతడు చేరినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

