Toxic Gas | ఘోర ప్రమాదం.. విషవాయువు లీకై 16 మంది మృతి
Toxic Gas | దక్షిణాఫ్రికా (South Africa)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జోహెన్నస్ బర్గ్ (Johannesburg) సమీపంలోని ఓ మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకై (Toxic Gas Leak) 16 మంది ప్రాణాలు కోల్పోయారు.
Toxic Gas | దక్షిణాఫ్రికా (South Africa)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జోహెన్నస్ బర్గ్ (Johannesburg) సమీపంలోని ఓ మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకై (Toxic Gas Leak) 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అక్కడి అధికారులు గురువారం వెల్లడించారు. జోహెన్నస్ బర్గ్ కు తూర్పున ఉన్న బోక్స్ బర్గ్ (Boksburg) సమీపంలో గల అనధికారిక సెటిల్ మెంట్ లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాల కోసం ఉపయోగించే గ్యాస్ లీకేజ్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు.
ఘటన సమాచారం అందిన వెంటనే ఎమర్జెన్సీ సేవలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విషపూరితమైన గ్యాస్ సిలిండర్ నుంచి లీకేజ్ అయినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 16 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు.
This is the activity that was taking place #BoksburgGasLeak pic.twitter.com/lxZjkjkr2y
— Panyaza Lesufi (@Lesufi) July 5, 2023
Our chopper is scanning the area from the sky #BoksburgGasLeak pic.twitter.com/xofyXq5csR
— Panyaza Lesufi (@Lesufi) July 5, 2023
Also Read..
Shashikala | ఈమె దగ్గర వంట నేర్చుకునేందుకు 30 దేశాల వాళ్లు క్యూ కడతారు !
Mexico Accident | మెక్సికోలో రోడ్డు ప్రమాదం.. 27 మంది మృత్యువాత..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

