Mexico Accident | మెక్సికోలో రోడ్డు ప్రమాదం.. 27 మంది మృత్యువాత..!
Mexico Accident | మెక్సికోలోని ఓక్సాకాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
Mexico Accident | మెక్సికోలోని ఓక్సాకాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. 17 మంది గాయపడ్డారని.. వారిని ఆసుపత్రులకు తరలించినట్లు చికిత్స అందిస్తున్నట్లు ఓక్సాకా స్టేట్ ప్రాసిక్యూటర్ బెర్నార్డో రోడ్రిగ్జ్ అలమిల్లా పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభిస్తున్నామన్నారు. సివిల్ ప్రోటెక్షన్ ఏజెన్సీ ప్రకారం.. గాయపడ్డ ఆరుగురు అపస్మారక స్థితిలో ఉన్నారని, వారిని ఆసుపత్రికి తరలించిన సమయంలో విషమంగా ఉందని పేర్కొంది.
స్థానిక రవాణా సంస్థ నిర్వహిస్తున్న బస్సు మంగళవారం రాత్రి మెక్సికో సిటీ నుంచి శాంటియాగో డి యోసోండువా పట్టణానికి వెళ్తున్నది. ప్రమాదవశాత్తు నియంత్రణ కోల్పోయి బస్సు మాగ్డలీనా పెనాస్కో పట్టణంలో వద్ద 80 అడుగుల లోతులో పడిపోయి ఉంటుందని రాష్ట్ర అధికారి జీసస్ రొమెరో పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బస్సును నడుపుతున్న కంపెనీ మెక్సికో సిటీ నుంచి రోజువారీ సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.
ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించామని, మృతదేహాలను ఎమర్జెన్సీ సర్వీసెస్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయని చెప్పారు. ఘటనపై ఓక్సాకా గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అయితే, మెక్సికోలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమే. మేలో పశ్చిమ రాష్ట్రమైన నయారిట్‌లో బస్సు లోయలో పడడం కనీసం 18 మంది మెక్సికన్ పర్యాటకులు మరణించారు. అదే నెలలో ఈశాన్య రాష్ట్రమైన తమౌలిపాస్‌లోని హైవేపై ప్యాసింజర్ వ్యాన్, సెమీ ట్రక్కు ఢీకొనడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

