Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రధాని నరేంద్ర మోదీని సాగనంపేందుకు ప్రజలు సంసిద్ధమయ్యారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జైరాం రమేష్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని పదవి నుంచి దిగిపోనున్నారు..ఆయనకు మరోసారి ప్రజా తీర్పు అనుకూలంగా రాదని స్పష్టం చేశారు. తొలి రెండు దశల పోలింగ్ అనంతరం బీజేపీ దక్షిణాదిలో సాఫ్ అవుతుందని, ఉత్తరాది, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో సగానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పారు.
ప్రజా సమస్యలు, వాస్తవ అంశాల నుంచి ప్రధాని మోదీ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకుని ఉందని, మోదీ పాలనతో వేసారిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వారణాసిలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Read More :
Cash Seized: వ్యాపారవేత్త ఇంటి నుంచి రూ.72 లక్షలు సీజ్