Gaza | గాజాపై ఇజ్రాయెల్ దాడి.. భారతీయుడు మృతి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం (Hamas-Israel war) కొనసాగుతూనే ఉంది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలోని (Gaza) రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్యసమితిలో పనిచేసే ఓ భారతీయుడు మృతిచెందారు.
గాజా: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం (Hamas-Israel war) కొనసాగుతూనే ఉంది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలోని (Gaza) రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్యసమితిలో పనిచేసే ఓ భారతీయుడు మృతిచెందారు.
యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ (DSS) విభాగంలో పనిచేస్తున్న ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్ దవాఖానకు వెళ్తుండగా దాడి జరిగింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తున్నది. ఆయతో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి భారత్‌కు చెందిన మాజీ సైనికుడని తెలుస్తున్నది.
కాగా, ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెర్రెస్ స్పందించారు. ఐరాసకు చెందిన డీఎస్ఎస్ విభాగంలోని సభ్యుడు మరణించడం చాలా బాధాకం. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రషాలోని యూరోపియన్ దవాఖానకు వెళ్లుండగా ఈ ఘటన చోటుచేసుకున్నది. గాజాలో ఇప్పటివరకు ఐరాసకు చెందిన 190 మందికిపైగా సిబ్బంది మరణించారు. మానవతావాదంతో సహాయం చేసే కార్యకర్తలకు తప్పనిసరిగా రక్షణ కల్పించాలన్నారు. యూఎన్ సిబ్బందిపై జరిగిన అన్ని దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని, బందీలందరినీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
Today a @UN vehicle was struck in Gaza, killing one of our colleagues & injuring another.
More than 190 UN staff have been killed in Gaza.
Humanitarian workers must be protected.
I condemn all attacks on UN personnel and reiterate my urgent appeal for an immediate humanitarian…— António Guterres (@antonioguterres) May 13, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Antonio Guterres
- DSS
- Gaza
- Hamas
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

