బెంగుళూరు: జేడీఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ(HD Revanna).. బెంగుళూరులో ఉన్న పరప్పారన్ అగ్రహారం సెంట్రల్ జైలు నుంచి ఇవాళ రిలీజ్ చేశారు. కిడ్నాప్ కేసులో ఆయనకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్‌ను మంజూరీ చేసింది. మాజీ ప్రధాని హెచ్డీ దేవ గౌడ కుమారుడైన రేవణ్ణను ప్రత్యేక విచారణ బృందం అరెస్టు చేసింది. హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ.. మహిళలను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక కోర్టు జడ్జి సంతోష్ గజానన్ భట్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు చెప్పారు. రేవణ్ణ ఆరు రోజుల పాటు జైలులో ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత భారీ కాన్వాయ్‌లో వెళ్లాడు. 5 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరీ చేశారు. బాధితులను బెదిరించడం చేయరాదు అని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది.