అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతం(Polling Percentage) ఇంకా కొలిక్కి రాలేదు. ఈ సాయంత్రానికి తుది గణాంకాలు వెలువడే అవకాశాలున్నాయి. ఏపీలో అనేక చోట్ల పోలింగ్ సమయానికి అత్యధికంగా ఓటర్లు(Voters) క్యూలైన్లో నిలబడి ఉండడంతో 47 చోట్ల కేంద్రాల్లో రాత్రి రెండు గంటల వరకు పోలింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్ 1.25 శాతంతో కలిపి 81.30 శాతం వరకు ఉండవచ్చని తెలుస్తోంది.
ప్రాథమిక అంచనాల ప్రకారం విశాఖ (Visaka), శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, మచిలీపట్నం, నెల్లూరు, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలో పోలింగ్ ఆలస్యంగా జరిగింది. గత సంవత్సరం ఏపీలో 79.2 పోలింగ్ శాతం నమోదు కాగా ఈ సంవత్సరం 83 శాతం వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ముందస్తు అంచనా వేసింది . రాష్ట్రంలో కొత్తగా నమోదైన 10 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.