Chat GPT | శాన్ఫ్రాన్సిస్కో: గూగుల్‌కు పోటీగా కృత్రిమ మేధస్సుతో కూడిన సెర్చ్ ఇంజిన్ ‘చాట్ జీపీటీ ఏఐ’ను త్వరలో ఆవిష్కరించబోతున్నట్టు ‘ఓపెన్ ఏఐ’ తాజాగా ప్రకటించింది. ఇంతకు ముందు తాము తీసుకొచ్చిన ‘చాట్‌బోట్’ మాదిరి ఇది కూడా ప్రజాదరణ పొందుతుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇంటర్నెట్లో ఏ విషయం వెతకాలన్నా ‘గూగుల్’ను ఆశ్రయిస్తాం. ఒక సెర్చ్ ఇంజిన్‌గా గత 3 దశాబ్దాలుగా ‘గూగుల్’ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది.
ఈ ప్లాట్‌ఫామ్‌ను కంపెనీ నిత్యం అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నది. అయితే ఏఐ సామర్థ్యాలతో చాట్‌జీపీటీ, చాట్‌బోట్ మార్కెట్లోకి రావటంతో.. గూగుల్ ఆధిపత్యానికి గండిపడింది. ఓపెన్ ఏఐ తన ‘చాట్ బోట్’కు లభించిన జనాదరణ చూశాక, గూగుల్‌కు పోటీగా ఏఐ సెర్చ్ ఇంజన్‌ను తీసుకొస్తున్నది. ఇది ఇంటర్నెట్లోని సమాచారమంతా మనముందు ఉంచేలా చేస్తుందని, నెటిజన్‌కు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.