Threads App | థ్రెడ్స్ యాప్ భారీగా రెస్పాన్స్..! కొద్దిగంటల్లోనే 2 మిలియన్స్ డౌన్లోడ్స్..!
Threads | ఎన్నో లీక్‌ల తర్వాత ఎట్టకేలకు థ్రెడ్స్ యాప్ ఎట్టకేలకు ప్రాంభమైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ట్విట్టర్‌కు పోటీ మెటా కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చింది. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ యాప్‌ను ఆవిష్కరించారు.
Threads App | ఎన్నో లీక్‌ల తర్వాత ఎట్టకేలకు థ్రెడ్స్ యాప్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఎలాన్ మస్క్‌కు చెందిన ట్విట్టర్‌కు పోటీ మెటా కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చింది. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ యాప్‌ను ఆవిష్కరించారు. ఇన్స్టాగ్రామ్ బృందం స్వయంగా థ్రెడ్ యాప్‌ను అభివృద్ధి చేసింది. రియల్ టైమ్ ఫీడ్ థ్రెడ్‌లో అందుబాటులో ఉంటుంది. థ్రెడ్ ఫీచర్లు, ఇంటర్ ఫేస్ మొత్తం దాదాపు ట్విట్టర్‌ను పోలి ఉంటుంది. థ్రెడ్ భారత్‌లోను అందుబాటులోకి వచ్చింది.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి థ్రెడ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ ఉంటే.. అంటే మీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఇప్పటికే ధ్రువీకరించబడి ఉంటే.. థ్రెడ్స్ యాప్‌లోనూ అకౌంట్ ఆటోమేటిక్‌గా ధ్రువీకరించబడుతుంది. యాప్‌ను యాపిల్ స్టోర్ నుంచి సైతం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్రెడ్ యాప్‌లో Instagram IDతో లాగిన్ చేసుకోవచ్చు. మెటా ఇన్స్టాగ్రామ్ యాప్ ఫొటో షేరింగ్ మల్టీమీడియా ప్లాట్‌ఫారమ్. అయితే థ్రెడ్స్ ట్విట్టర్ మాదిరిగానే టెక్స్ట్ ఆధారిత సోషల్ మీడియా యాప్. ప్రస్తుతం ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్న వారికి.. థ్రెడ్స్‌ను వాడడంలో ఎలాంటి సమస్యలుండవు.
ట్విట్టర్ పాత వెర్షన్ లాగా ఉంటుంది. థ్రెండ్స్లో వెబ్ లింక్‌లు, ఫొటోలు (ఒకేసారి గరిష్టంగా 10ఫొటోలు). నిమిషం వరకు వీడియోలను, 500 వరకు వర్డ్స్‌ను పోస్ట్ చేయవచ్చు. అలాగే ఎవరినైనా బ్లాక్ చేయడంతో పాటు ఫాలోకావొచ్చు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరినైనా బ్లాక్ చేసి ఉంటే.. థ్రెండ్స్లో సైతం ఆ అకౌంట్స్ బ్లాక్ లిస్ట్‌లో ఉంటాయి. ఇదిలా ఉండగా.. యాప్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ప్రారంభించిన కొద్ది గంటల్లోనే రెండు మిలియన్లకుపైగా యూజర్లు థ్రెడ్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

