Earthquake | ఐస్లాండ్ లో ఒక్కరోజే 1600 భూకంపాలు.. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగే అవకాశం
Earthquake | యూరప్ (Europe)లోని ఐస్లాండ్ (Iceland)ని వరుస భూకంపాలు (Earthquakes) వణికించాయి. రాజధాని రేక్జావిక్ ( Reykjavik) పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే ఏకంగా 1600 సార్లు భూమి కంపించింది. ఈ విషయాన్ని ఆ దేశ వాతావరణ కార్యాలయం (country weather office) బుధవారం వెల్లడించింది.
Earthquake | యూరప్ (Europe)లోని ఐస్లాండ్ (Iceland)ని వరుస భూకంపాలు (Earthquakes) వణికించాయి. రాజధాని రేక్జావిక్ ( Reykjavik) పరిసర ప్రాంతాల్లో నిన్న ఒక్క రోజే ఏకంగా 1600 సార్లు భూమి కంపించింది. ఈ విషయాన్ని ఆ దేశ వాతావరణ కార్యాలయం (country weather office) బుధవారం వెల్లడించింది. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం అగ్నిపర్వత వ్యవస్థపై ఉన్న మౌంట్ ఫాగ్రాడల్స్ఫ్జాల్ (Mount Fagradalsfjall) కింద భూ ప్రకంపనలు ప్రారంభమైనట్లు అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తం 1600 సార్లు భూమి కంపించగా.. అందులో నాలుగు ప్రకంపనలు 4 కన్నా ఎక్కువ తీవ్రతతో సంభవించినట్లు వెల్లడించింది.
కాగా, ఐస్లాండ్ దేశంలో నైరుతి కొనలో ఉన్న రేక్జానెస్ ద్వీపకల్పంలో గత రెండేళ్లలో రెండు విస్ఫోటనాలు సంభవించినట్లు పేర్కొంది. మొత్తం యూరప్ లోనే ఐస్లాండ్ దేశంలో అత్యంత చురుకైన అగ్ని పర్వతం ఉంది. ఉత్తర అట్లాంటిక్ ద్వీపం ఆర్కిటిక్ సర్కిల్ కు సరిహద్దుల్లో ఉంటుంది. ఇది యూరేషియన్, ఉత్తర అమెరికా టెక్టానిక్ ప్లేట్ వేరు చేసే ప్రాంతంలో ఈ అగ్నిపర్వతం ఉంది. ఇక్కడ 2021, 2022లో జరిగిన అగ్ని పర్వతం విస్ఫోటనాల్లో బయటకు వచ్చిన లావా (Lava) దాదాపుగా ఫాగ్రాడల్స్ఫ్జాల్ పర్వతం వరకు వ్యాపించింది. ఇది రాజధాని రేక్జావిక్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పట్లో దీన్ని చూసేందుకు వేలాది మంది సందర్శకులు ఆ ప్రాంతానికి తరలివచ్చారు.
Also Read..
Urinated | ఆదివాసీపై మూత్ర విసర్జన.. బాధితుడి కాళ్లు కడిగిన సీఎం చౌహాన్
Elon Musk | మెటా థ్రెడ్స్ యాప్ పై మస్క్ స్పందన ఇదీ..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
Revanth Reddy | సీఎం దోచి పారేస్తున్నడు.. దొరికింది దొరికినట్టు దిగమింగుతున్నడు.. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

