Rajya Sabha : ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) లో రాష్ట్రపతి పాలన (President rule) ను మరో ఆరు నెలల కాలానికి పొడిగిస్తూ కేంద్రం (Union Government) ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించిన తీర్మానానికి గత నెల 30న లోక్సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. ఇవాళ ఆ తీర్మానాన్ని ప్రభుత్వం రాజ్యసభ (Rajya Sabha) ముందు ఉంచింది. రాజ్యసభ కూడా ఆ తీర్మానానికి ఆమోదం తెలిపింది.
మంగళవారం ఉదయం హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్.. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపునకు సంబంధించిన తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దానికి సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల నడుమనే తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానం ప్రకారం మణిపూర్లో 2025 ఆగస్టు 13 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగనుంది.
మణిపూర్లో రాజకీయ అనిశ్చితి కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రెండేళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. దాంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి నుంచి మణిపూర్ అసెంబ్లీ అధికారాలు పార్లమెంట్ చేతుల్లోకి, గవర్నర్ అధికారాలు రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్లాయి.