ITR filing | ఫైలింగ్ తర్వాత 30 రోజుల్లో వెరిఫై చేయకపోతే మీ ఐటీ రిటర్న్స్ చెల్లదు..!
ITR filing | మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ (Income Tax Returns) దాఖలు చేశారా..? అయితే అంతటితో మీ పని పూర్తి కాలేదు. ఆన్లైన్ (Online) లో రిటర్న్‌లు అప్లోడ్ చేసిన తర్వాత 30 రోజుల్లోగా వాటిని తప్పనిసరిగా వెరిఫై చేయాల్సి ఉంటుందని, లేదంటే ఆదాయపు పన్ను శాఖ మీరు దాఖలు చేసిన ఆ రిటర్న్స్‌ను చెల్లనివిగా పరిగణిస్తుందని ఎక్స్పర్ట్స్ (Experts) హెచ్చరిస్తున్నారు.
ITR filing : మీరు ఆదాయపు పన్ను రిటర్న్స్ (Income Tax Returns) దాఖలు చేశారా..? అయితే అంతటితో మీ పని పూర్తి కాలేదు. ఆన్లైన్ (Online) లో రిటర్న్‌లు అప్లోడ్ చేసిన తర్వాత 30 రోజుల్లోగా వాటిని తప్పనిసరిగా వెరిఫై చేయాల్సి ఉంటుందని, లేదంటే ఆదాయపు పన్ను శాఖ మీరు దాఖలు చేసిన ఆ రిటర్న్స్‌ను చెల్లనివిగా పరిగణిస్తుందని ఎక్స్పర్ట్స్ (Experts) హెచ్చరిస్తున్నారు.
కేవలం ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో వివరాలు సమర్పించినంత మాత్రాన ప్రక్రియ ముగిసినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. 2025-26 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేసేందుకు పొడిగించిన గడువు సెప్టెంబర్ 15 తో ముగియనుంది. ఇప్పటికే చాలామంది పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఫైలింగ్ తర్వాత అత్యంత కీలకమైన వెరిఫికేషన్ దశను నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
గడువులోగా వెరిఫై చేయని రిటర్న్‌లను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయదు. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను రెండు పద్ధతుల్లో వెరిఫై చేయవచ్చు. అందులో మొదటిది సులభమైన ఈ-వెరిఫికేషన్ పద్ధతి. రెండోది ఆఫ్‌లైన్ పద్ధతి. ఆన్లైన్లో అయితే ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా క్షణాల్లో వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. ఇది చాలా సులభమైన, వేగవంతమైన పద్ధతి. ఇందుకు ఈ-ఫైలింగ్ పోర్టల్ (incometax.gov.in) లోకి లాగిన్ అయి, ‘ఈ-వెరిఫై రిటర్న్’ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ‘ఆధార్ ఓటీపీ’ని సెలెక్ట్ చేసుకుని, మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే సరిపోతుంది.
నెట్ బ్యాంకింగ్, డీమ్యాట్ ఖాతా, ఏటీఎంల ద్వారా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (EVC) జనరేట్ చేసి కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ (DSC) ఉన్నవారు దాని ద్వారా కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్‌లైన్ పద్ధతిని ఎంచుకుంటే, ఐటీఆర్-వి అకనాలెడ్జ్మెంట్ ఫారం డౌన్లోడ్ చేసుకుని, దానిపై సంతకం చేసి, ఫైల్ చేసిన 30 రోజుల్లోగా బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్‌కు పోస్టులో పంపాలి. అయితే ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది.
ఏదైనా కారణంవల్ల 30 రోజుల గడువులోగా మీరు ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తి చేయలేకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోనే ‘కండోనేషన్ ఆఫ్ డిలే (Condonation of Delay)’ అని అభ్యర్థన పెట్టుకోవచ్చు. ఆలస్యానికి గల కారణాలను వివరిస్తూ అభ్యర్థన సమర్పిస్తే ఆదాయపు పన్ను శాఖ దాన్ని ఆమోదించే అవకాశం ఉంటుంది. ఐటీ శాఖ ఆమోదం తెలిపితే మీ రిటర్న్ వెరిఫై అయినట్లుగా పరిగణిస్తారు.
Read More >>
భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఖరీదు ఎంతంటే..!
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందే భారత్ తొలి స్లీపర్ ట్రెయిన్ ప్రారంభం.. ఎప్పుడంటే..!
సొంతిళ్లను వదిలి.. నాలుగు అపార్ట్‌మెంట్స్‌ను అద్దెకు తీసుకున్న ఆమిర్ ఖాన్.. ఎందుకో తెలుసా..?
తిరుమలలో చిరుత కలకలం.. పిల్లి మీద దాడికి యత్నం
బంజారాహిల్స్‌లో కుంగిన రోడ్డు.. దాంట్లో కూరుకుపోయిన వాటర్ ట్యాంకర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
Cab Driver: భార్యను, ఆమె బంధువుల్లో ఆరుగుర్ని కడతేర్చిన క్యాబ్ డ్రైవర్
Kothagudem | ప్రేమించడమే ఆమె చేసిన నేరం.. భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

