Leopard | తిరుమల : తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈస్ట్ బాలాజీ నగర్ సమీపంలో ఉన్న బాల గంగమ్మ ఆలయం పరిసరాల్లో సోమవారం రాత్రి చిరుత సంచరించింది. అక్కడున్న ఓ పిల్లి మీద దాడి చేసేందుకు చిరుత యత్నించింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరుత సంచారంపై ఆలయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు ఆలయం వద్దకు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించి భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులను అప్రమత్తం చేశారు.
తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం
ఈస్ట్ బాలాజీ నగర్ వద్ద గంగమ్మ గుడి సమీపంలోకి అర్ధరాత్రి చిరుత కలకలం
దీంతో వెంటనే టీటీడీ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు pic.twitter.com/v8x6w6Z8Av
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2025