ఆర్టీసీకి నిరంతరాయంగా నీటి సరఫరా
తెలంగాణ ఆర్టీసీ సంస్థకు క్రమం తప్పకుండా ‘జీవా’ వాటర్‌ను సరఫరా చేస్తున్నామని ఫౌంటెయిన్ స్ప్రింగ్స్ సంస్థ వెల్లడించింది. ఆర్టీసీ బస్సుల్లో ‘జీవా’ తాగునీటి బాటిళ్ల సరఫరా నిలిచిపోయిందంటూ ‘నమస్తే తెలంగాణ’లో ఈనెల 22న ‘ఆర్టీసీ ప్రయాణాలపై కరువు ఎఫెక్ట్..’
- అంతరాయమనేది అవాస్తవం
- ప్లాంట్‌లో ఎలాంటి సమస్య లేదు
- బోరుబావుల ద్వారా 2010 నుంచి నీరందిస్తున్నాం
- ‘జీవా’ వాటర్ సరఫరాపై వివరణ ఇచ్చిన ‘ఫౌంటెయిన్ స్ప్రింగ్స్’
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీ సంస్థకు క్రమం తప్పకుండా ‘జీవా’ వాటర్‌ను సరఫరా చేస్తున్నామని ఫౌంటెయిన్ స్ప్రింగ్స్ సంస్థ వెల్లడించింది. ఆర్టీసీ బస్సుల్లో ‘జీవా’ తాగునీటి బాటిళ్ల సరఫరా నిలిచిపోయిందంటూ ‘నమస్తే తెలంగాణ’లో ఈనెల 22న ‘ఆర్టీసీ ప్రయాణాలపై కరువు ఎఫెక్ట్..’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఫౌంటెన్ స్ప్రింగ్స్ సంస్థ స్పందించింది. ఆర్టీసీకి సరఫరా చేస్తున్న నీటి విషయంలో తమవైపు నుంచి ఎలాంటి సమస్య లేదని వెల్లడించింది. కరువు, నీటి కొరత కారణంగా ఆర్టీసీకి నీటి సరఫరా నిలిచిపోయిందని, ప్లాంటులో సాంకేతిక సమస్యలు ఉన్నాయని, దాదాపు 20 రోజులుగా ప్రయాణికులకు నీరు అందడం లేదని కథనంలో పేరొన్న అంశాలపట్ల అభ్యంతరం వ్యక్తంచేసింది. దీనిపై న్యాయవాది ద్వారా వివరణ ఇచ్చింది. ఫౌంటెన్ స్ప్రింగ్స్ సంస్థ 2010 నుంచి ఇప్పటివరకూ నీటి సరఫరాలో ఉన్నట్టు తెలిపింది. కనాటి నుంచి చట్టబద్ధ అనుమతులతో బోర్వెల్ ద్వారా నీటిని వినియోగిస్తున్నట్టు తెలిపింది. ఇప్పటివరకు నిరంతరాయంగా, తగినంత నీటి వనరును కలిగి ఉన్నట్టు పేర్కొన్నది.
కరువు, సాంకేతిక సమస్యలేమీ లేవు
ఈ సందర్భంగా ఫౌంటెన్ స్ప్రింగ్స్ సంస్థపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ సంస్థ న్యాయవాది ఎం వరలక్ష్మి వాస్తవాలను వివరించారు. ‘టీజీఎస్ఆర్టీసీకి ‘జీవా’ నీటిని క్రమం తప్పకుండా సరఫరా చేస్తున్నాం. గత 20 రోజులుగా కూడా ఎలాంటి సరఫరా అంతరాయం, నిలిపివేత, విఘాతం అసలే చోటుచేసుకోలేదు. మా దగ్గర ఎలాంటి ‘సాంకేతిక సమస్య’ చోటు చేసుకోలేదు. అలా ఉందనే విషయం గురించి మేము ఎవ్వరికీ సమాచారం ఇవ్వలేదు. ఆ కారణంగా దాదాపు 20 రోజులపాటు సరఫరా నిలిచిపోయిందనేది పూర్తిగా అవాస్తవం’ అని పేర్కొన్నారు. తమ ప్లాంట్‌కు ఎలాంటి కరువు ఇబ్బందులు లేవని తెలిపారు.
ఆర్టీసీ వర్గాలు ఇచ్చే సమాచారం మేరకు రాసినట్టు చెప్తున్న ఆ కథనాన్ని పాఠకుడు చదివితే.. అందులోని పదాలు, అర్థాలు తమ సంస్థ దగ్గరే తప్పు ఉందనే దురభిప్రాయం కలుగుతున్నదని పేర్కొన్నారు. ఇటువంటి వార్తల వల్ల సంస్థ వ్యాపార ప్రతిష్ఠ, విశ్వసనీయత, క్రెడిట్ స్థాయిపై నేరుగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలున్నట్టు చెప్పారు. టీజీఎస్ఆర్టీసీకి నీటిని సరఫరా చేసే అనేక సంస్థలు ఉన్నప్పటికీ, సదరు కథనంలో ఫౌంటెయిన్ స్ప్రింగ్స్ పేరును మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావించారని.. ఇతర సరఫరాదారుల పేర్లను పేరొనలేదని.. తద్వారా ఆర్టీసీకి నీటి సరఫరాలో జరిగినట్టు పేరొన్న అంతరాయానికి సదరు సంస్థ ఒకటే బాధ్యులనే తప్పుడు భావన కలుగుతున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

