Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు కారణం ఆయన వ్యక్తిగత జీవితమే. బాలీవుడ్ మహిళా డైరెక్టర్ కిరణ్ రావుతో విడాకుల అనంతరం ఆమిర్ మళ్లీ ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్ (Gauri Spratt) అనే మహిళతో కొన్నాళ్లుగా డేటింగ్లో ఉన్నాడు. ఈ విషయాన్ని ఆమిర్ స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు మరోసారి ఆయన హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఆమిర్ తన సొంత ఇంటిని వదిలి అద్దె ఇంటికి షిప్ట్ అవ్వడమే అందుకు కారణం.
Zapkey.com ప్రకారం.. బాంద్రా వెస్ట్‌లోని పాలి హిల్ (Pali Hill) ప్రాంతంలో నర్గీస్ దత్ రోడ్లోగల విల్నోమోనా అనే సొసైటీలో నాలుగు అపార్ట్మెంట్లను ఆమిర్ అద్దెకు తీసుకున్నారు. నెలకు రూ.24.5 లక్షల అద్దె ప్రాతిపదికన లీజుకు తీసుకున్నారు (Aamir Khan leases four flats). అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకున్నారు. మే 2025 నుంచి 2030 మే వరకూ ఐదు సంవత్సరాల పాటూ లగ్జరీ అపార్ట్మెంట్లను లీజుకు తీసుకున్నారు. లీజు ఒప్పందంలో భాగంగా రూ.1.46 కోట్లకు పైగా సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేశారు. రూ.4 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.2,000 రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించారు. కాగా, ఆమిర్ ఖాన్‌కు విర్గో కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 12 అపార్ట్మెంట్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సొసైటీలో డెవలెప్మెంట్ వర్క్స్ కారణంగా ఆయన అద్దె ఇంటికి షిఫ్ట్ అయినట్లు ముంబై మీడియా పేర్కొంది.
Also Read..
Hansika Motwani | మరో సెలబ్రిటీ జంట విడాకులు.. ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలు డిలీట్..!
Kamal Hasan | సనాతన ధర్మం సంకెళ్లను తెంచుకోవడానికి ఉన్న ఏకైక ఆయుధం విద్య : కమల్ హాసన్