Hansika Motwani | ఇటీవలే కాలంలో పలువురు సినీసెలబ్రిటీలు విడాకులు (Divorce) తీసుకోవడం మనం చూశాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా కొన్ని కారణాల వలన విడిపోతున్నారు. సమంత-నాగచైతన్య మొదలు నిహారిక- చైతన్య, ధనుష్-ఐశ్వర్య, ఏఆర్ రెహామాన్, అమీర్ ఖాన్.. ఇలా టాప్ సెలబ్రిటీలు తమ వివాహ బంధానికి అర్ధంతరంగా ముగింపు పలికారు. ఇప్పుడు తాజాగా మరో జంట విడాకులు తీసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
కొన్నేళ్ల క్రితం దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఓ వెలుగువెలిగిన బొద్దుగుమ్మ హన్సిక (Hansika Motwani) తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. భర్త సోహైల్ (Sohael Khaturiya)తో మూడేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకబోతోందని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఈ రూమర్స్ వేళ ఆమె తాజాగా ఇన్స్టావేదికగా తన పెళ్లిఫొటోలను డిలీట్ చేసింది (Hansika Deletes Wedding Photos). దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడం ఖాయమని అంతా మాట్లాడుకుంటున్నారు.
ప్రియుడు సోహైల్ కథూరియా (Sohael Khaturiya)ని హన్సిక 2022 డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. రాజస్థాన్ జైపూర్లోని ఓ కోటలో సింధీ సంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో మూడేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు సమాచారం.
Also Read..
Sruthi Hassan | పవన్ కళ్యాణ్ నుండి అది దొంగతనం చేస్తానంటూ శృతి షాకింగ్ కామెంట్స్