Sruthi Hassan | సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ ఈ నెల ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే. మాస్ అండ్ స్టైల్ మాస్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, సాండల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ చిత్రానికి సంగీతం అందించారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు.
ఇటీవల చెన్నైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ జరిగింది. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి క్యాస్టింగ్ అందరు కూడా కార్యక్రమంలో సందడి చేశారు. ఇక తాజాగా హైదరాబాద్‌లో కూడా చిన్నపాటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శృతి హాసన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో భాగమవటం నా కెరీర్లో ఓ మైలురాయి. లోకేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్. నాకు చాలా బలమైన క్యారెక్టర్ ఇచ్చారు. రజినీ సార్‌తో నటిస్తానని అనుకోలేదు. ఇది నిజంగా గొప్ప అనుభవం. నాగార్జున గారు స్క్రీన్‌పై ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనిరుధ్ మ్యూజిక్ సినిమాకి స్పెషల్ హైలైట్ అవుతుంది అని తెలిపారు.
ఇక ప్రముఖ యాంకర్ సుమ అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకు శృతి ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఏం దొంగతనం చేస్తావు అని సుమ అడగ్గా.. ఎనర్జీ, చరిష్మా అని పేర్కొంది. ఇక ప్రభాస్ దగ్గర నుంచి ఫుడ్, అల్లు అర్జున్ దగ్గర నుంచి డాన్సింగ్, మహేష్ బాబు దగ్గర నుంచి స్టైల్, గ్రేస్, బాలయ్య దగ్గర నుంచి హ్యూమర్, రజినీకాంత్ దగ్గర నుంచి అన్నీ, నాగార్జున దగ్గర నుంచి డైట్, ఫిట్నెస్ అని పేర్కొంది. ఇక లోకేష్ కనగరాజ్ స్పందిస్తూ.. నన్ను నమ్మి ఈ కథకు ఒప్పుకున్న రజినీ సార్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో నాగార్జున గారు అద్భుతంగా నటించారు. సినిమాలో ఆయన పాత్ర చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు. అలాగే ఉపేంద్ర, సత్యరాజ్, శోబిన్, ఆమిర్ ఖాన్ గార్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది మాస్‌కి మాత్రమే కాదు, క్లాస్‌కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా అవుతుంది అన్నారు. కమల్ హాసన్, రజినీకాంత్ వంటి లెజెండ్స్‌తో పని చేసిన లోకేష్, త్వరలో తెలుగులో స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. తాను కమిటైన ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత, తెలుగులో ఒక స్ట్రాంగ్ ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నా,” అని పేర్కొన్నారు.