Hyderabad | హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. రోడ్డు ఆకస్మాత్తుగా కుంగడంతో.. అటువైపుగా వెపుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ అందులో కూరుకుపోయింది. దీంతో వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు.. డ్రైవర్, క్లీనర్‌ను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షం కారణంగానే రోడ్డు కుంగినట్లు అధికారులు పేర్కొన్నారు. రోడ్డు కుంగిన ఏరియాలో నాలా పైప్‌లైన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రోడ్డు కుంగడంతో ఆ ఏరియాతో పాటు సమీప ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. వాటర్ ట్యాంకర్‌ను బయటకు తీసేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.
బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-1లో నాలా ఛాంబర్ పైకి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్ pic.twitter.com/nigHHfG19O
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2025