శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 13:54:00

హోటల్‌లో మరోసారి గెహ్లాట్ సీఎల్పీ భేటీ

హోటల్‌లో మరోసారి గెహ్లాట్ సీఎల్పీ భేటీ

జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్‌కు మద్దతిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత కొన్ని రోజులుగా జైపూర్‌లోని ఫెయిర్‌మౌంట్ హోటల్‌లో ఉంటున్నారు. అంతాక్షరీ, ఆటపాటలతో వారు కాలక్షేపం చేస్తున్నారు. మరోవైపు సీఎం అశోక్ గెహ్లాట్ మంగళవారం ఫెయిర్‌మౌంట్ హోటల్‌లో మరోసారి సీఎల్పీ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోత్సర, సీఎం గెహ్లాట్‌కు మద్దతిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎదురుతిరిగిన సచిన్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న 18 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టు సాయంత్రంలోగా తేల్చనున్నది. ఈ నేపథ్యంలో హోటల్‌లో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం అశోక్ గెహ్లాట్ తాజాగా సీఎల్పీ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.  logo