Kerala Rain | కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షం (Kerala Rain ) ముంచెత్తింది. కొచ్చి, తిరువనంతపురం, అలప్పుజ, కాసర్గోడ్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం (Thiruvananthapuram), అలప్పుజ, కన్నూరు, కాసర్గోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
అదేవిధంగా దేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఘాట్ ప్రాంతాల్లో 29వ తేదీన విస్తారంగా వర్షం కురుస్తుందని తెలిపింది. అదేవిధంగా కొంకణ్-గోవా, మధ్య మహారాష్ట్రలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
#WATCH | Kerala: Rain lashes several parts of Thiruvananthapuram city
IMD has today issued an orange alert in four districts of Kerala – Thiruvananthapuram, Alappuzha, Kannur and Kasaragod. A yellow alert has been issued for all the remaining districts. pic.twitter.com/wEzHLVGWFc
— ANI (@ANI) September 29, 2023
#WATCH | Kerala: Rain lashes several parts of Kochi city
IMD has today issued an orange alert in four districts of Kerala – Thiruvananthapuram, Alappuzha, Kannur and Kasaragod. A yellow alert has been issued for all the remaining districts. pic.twitter.com/dkLLHmGrE6
— ANI (@ANI) September 29, 2023
Also Read..
Uttar Pradesh | దారుణం.. పెళ్లికి ముందే గర్భం దాల్చిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు
Tamilnad Mercantile Bank | క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ.9వేల కోట్లు జమ.. బ్యాంక్ సీఈవో రాజీనామా