Suicide Blast | వరుస దాడులతో దద్దరిల్లిన పాక్.. గంటల వ్యవధిలోనే రెండు సూసైడ్ బ్లాస్ట్స్.. 55 మంది మృతి
Suicide Blast | మిలాద్ ఉన్ నబి వేళ పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) వరుస బాంబు దాడులతో దద్దరిల్లింది. గంటల వ్యవధిలోనే రెండు ఆత్మాహుతి దాడులు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల్లో మొత్తం 55 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా గాయపడ్డారు.
Suicide Blast | మిలాద్ ఉన్ నబి వేళ పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) వరుస బాంబు దాడులతో దద్దరిల్లింది. శుక్రవారం మధ్యాహ్నం మొదటగా బలోచిస్తాన్(Balochistan)లోని మస్తుంగ్ జిల్లాలోని ఓ మసీదు వద్ద ఆత్మాహుతి దాడి (Suicide Blast) జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సుమారు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa Province)లోని హంగు జిల్లాలో గల ఓ మసీదు వద్ద మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మిలాద్ సందర్భంగా మసీదు వద్ద 30 నుంచి 40 మంది గుమిగూడి ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు ఘటనల్లో కలిపి ఇప్పటి వరకూ మొత్తం 55 మంది ప్రాణాలు కోల్పోయారు.
కాగా అంతకు ముందు బలోచిస్తాన్(Balochistan) జరిగిన దాడిలో 52 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. మదీనా మసీదు సమీపంలో మిలాద్ ఉన్ నబి ర్యాలీ తీసేందుకు జనం గుమిగూడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ గిశ్కోరి కారు వద్దే బాంబర్ తనను తాను పేల్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాంబు పేలిన ప్రాంతం చెల్లాచెదురైంది. శవాలన్నీ గట్టలుగా పడి ఉన్నాయి. తీవ్రంగా గాయపడ్డవారిని క్వెట్టాకు తరలించారు. సమీపంలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ విధించారు.
Also Read..
Uttar Pradesh | దారుణం.. పెళ్లికి ముందే గర్భం దాల్చిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు
Tamilnad Mercantile Bank | క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ.9వేల కోట్లు జమ.. బ్యాంక్ సీఈవో రాజీనామా
London Tower Bridge | పైకిలేచిన వంతెన కిందకురాలేదు.. టవర్ బ్రిడ్జ్ వద్ద ఆసక్తికర ఘటన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

