London Tower Bridge | పైకిలేచిన వంతెన కిందకురాలేదు.. టవర్ బ్రిడ్జ్ వద్ద ఆసక్తికర ఘటన
London Tower Bridge | ఇంగ్లాండ్‌లోని లండన్ టవర్ బ్రిడ్జ్ (London Tower Bridge) వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నదిలో పడవ ప్రయాణం కోసం దారి ఇచ్చేందుకు పైకిలేచిన బ్రిడ్జ్ వంతెన ఆ తర్వాత కిందకు రాలేదు.
London Tower Bridge | ఇంగ్లాండ్‌లోని లండన్ టవర్ బ్రిడ్జ్ (London Tower Bridge) వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నదిలో పడవ ప్రయాణం కోసం దారి ఇచ్చేందుకు పైకిలేచిన బ్రిడ్జ్ వంతెన ఆ తర్వాత కిందకు రాలేదు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
లండన్‌లోని థేమ్స్ నదిపై టవర్ బ్రిడ్జ్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ బ్రిడ్జ్ నదీ ప్రయాణానికీ, రోడ్డు రవాణాకూ వీలుగా నిర్మించారు. నదిలో పడవ ప్రయాణిస్తున్న సమయంలో ఈ బ్రిడ్జ్ పైకి లేస్తుంది. పడవ వెళ్లిపోగానే ఆ బ్రిడ్జి యథావిథిగా కిందకు దిగుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియే. ఆ సమయంలో బ్రిడ్జ్‌కు ఇరువైపులా ఉన్న వాహనాలు నిలిచిపోతుంటాయి. అయితే, గురువారం నాడు ఆ బ్రిడ్జ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. మధ్యాహ్నం సమయంలో ఓ పడవ నదిలో ప్రయాణిస్తున్న సమయంలో బ్రిడ్జ్ పైకి లేచింది. ఆ తర్వాత యథాస్థానానికి రాలేకపోయింది. దీంతో వంతెనపై నుంచి వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో లండన్ వీధుల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.
ఈ టవర్ వంతెనను 1894లో నిర్మించారు. ఇది గ్రేటర్ లండన్ బారోగ్స్ ఆఫ్ టవర్ హామ్లెట్స్, లండన్‌లోని సౌత్‌వార్క్ మధ్య థేమ్స్ నదిపై నిర్మించబడింది. ఈ బ్రిడ్జి 76 మీటర్లు (250 అడుగులు) వెడల్పు, 240 మీటర్లు (800 అడుగులు) పొడవు ఉంటుంది. ఈ వంతెన థేమ్స్ నదికి 61 మీటర్లు (200 అడుగులు) ఎత్తులో ఉంటుంది. రోడ్డు, నదీ ప్రయాణానికి వీలుగా నిర్మించిన ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Tower Bridge Stuck Open: Technical Glitch Disrupts London Traffic.#LondonTowerBridge #TowerBridgeStuck #TowerBring #LondonTransportation #BNN pic.twitter.com/P0uE0YjRxR
— Nimrah Khatoon (@KashifNimrah) September 28, 2023
Also Read..
Karnataka | కర్ణాటక బంద్.. మూతపడిన విద్యా, వ్యాపార సంస్థలు.. 44 విమానాలు రద్దు
Divorce: వైవాహిక బంధం సరిగా లేకున్నా.. విడాకులు ఇవ్వకపోవడం క్రూరత్వమే: కేరళ హైకోర్టు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

