Divorce: వైవాహిక బంధం సరిగా లేకున్నా.. విడాకులు ఇవ్వకపోవడం క్రూరత్వమే: కేరళ హైకోర్టు
Divorce: తరుచూ గొడవపడడం, ఒకర్ని ఒకరు గౌరవించుకోకపోవడం, ఒకర్ని ఒకరు పట్టించుకోకపోవడం.. ఇలాంటి సందర్భాల్లో కలిసి జీవించడం కుదరదని, అలాంటప్పుడు భాగస్వామి ఆడైనా, మగైనా.. విడాకుల్ని అడ్డుకోవడం క్రూరత్వం అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది.
కొచ్చి: దంపతుల మధ్య వైవాహిక బంధం పూర్తిగా ధ్వంసమైనా.. విడాకులు(Divorce) ఇవ్వకుండా భాగస్వామి అడ్డుకోవడం క్రూరత్వమే అవుతుందని కేరళ హైకోర్టు తెలిపింది. జస్టిస్ ఏ మహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సోఫీ థామస్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ తరుచూ గొడవపడడం, ఒకరికి ఒకరు మర్యాద ఇచ్చుకోకపోవడం, వెలివేసుకోవడం లాంటి ఘటనల వల్ల ఆ జంట కలిసి ఉండలేదని, అలాంటప్పుడు ఆ దంపతులు విడాకులు తీసుకోవాలని, ఒకవేళ ఒకరు దరఖాస్తు చేసుకున్నా, భాగస్వామి ఆ విడాకుల్ని అడ్డుకోవడం క్రూరమైన చర్యే అవుతుందని హైకోర్టు తెలిపింది.
త్రిసూరుకు చెందిన స్థానికుడు వేసిన కేసులో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2002లో పెళ్లి చేసుకున్న వ్యక్తి.. తనకు భార్య నుంచి విడాకులు ఇప్పించాలని గతంలో కోర్టును ఆశ్రయించారు. తన భార్య కేవలం డబ్బును మాత్రమే కోరుకుంటోందని, ఆమెకు మరో అఫైర్ ఉందని, ఇంటి నిర్మాణం కోసం విదేశాల నుంచి పంపిన డబ్బును ఆమె వృధా చేసినట్లు ఆ వ్యక్తి తన ఫిర్యాదులో ఆరోపించాడు. 2011లో పిటీషనర్ కోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు అతను 60 ఏళ్లు దాటాడు.
ఈ కేసులో ఇద్దరూ కోర్టు చుట్టు తిరగడం దశాబ్ధం దాటినట్లు ధర్మాసనం తెలిపింది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా.. వారి మధ్య సరైన జీవనయానం లేదని కోర్టు చెప్పింది. ఈ కేసులో పిటీషనర్‌కు విడాకులు మంజూరీ చేస్తూ తీర్పును ఇచ్చింది. భార్యకు పది లక్షలతో పాటు 10 సెంట్ల స్థలాన్ని ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

