Karnataka | కర్ణాటక బంద్.. మూతపడిన విద్యా, వ్యాపార సంస్థలు.. 44 విమానాలు రద్దు
Karnataka | పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల (Cauvery River water dispute) చేయాలన్న కర్ణాటక (Karnataka) ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Karnataka | పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల (Cauvery River water dispute) చేయాలన్న కర్ణాటక (Karnataka) ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంద్ ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ బంద్ కారణంగా సాధారణ జన జీవనానికి తీవ్ర ఆంటకాలు ఏర్పడ్డాయి. బంద్‌కు మద్దతుగా నగరంలోని హోటళ్లు, విద్యా, వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. రవాణా వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
ఈ బంద్ విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. నేడు బెంగళూరులోని కంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 44 విమానాలను అధికారులు రద్దు చేశారు. అందులో 22 విమానాలు ల్యాండ్ కావాల్సి ఉండగా.. మరో 22 విమానాలు టేకాఫ్ చేయాల్సి ఉంది. బంద్ కారణంగా అధికారులు విమానాల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణికులకు ముందుగానే అందజేశారు. ఇక కర్ణాటక బంద్ కారణంగా చాలా మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను ముందుగానే రద్దు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు ఈ బంద్‌కు కర్ణాటక రక్షణ వేదికె, హసిరు సేన, జయ కర్ణాటక సంఘం సహా మొత్తం 1,900 సంఘాలు ఈ బంద్‌కు మద్దతు తెలిపాయి. ఉదయం 6 గంటల నుంచే ఆయా సంఘాల నేతలు రోడ్లపైకి వచ్చి బంద్ పాటిస్తున్నారు. బెంగళూరు నగరంతోపాటు పలు ప్రధాన ప్రాంతాల్లోనూ బంద్ కొనసాగుతోంది. చిక్కమంగళూరులో నిరసనకారులు ద్విచక్రవాహనాల్లో పెట్రోల్ బంకుల్లోకి ప్రవేశించి ఆందోళన చేపట్టారు. ఇక మండ్యలో నిరసరకారులు రోడ్లపైకి వచ్చి కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకుంటున్నారు. వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ ఈ బంద్ కొనసాగనుంది.
#WATCH | Members of farmers’ association in Karnataka’s Mandya hold ‘Rail Roko’ protest over the Cauvery water sharing issue. pic.twitter.com/HQEqTmdBHG
— ANI (@ANI) September 29, 2023
Also Read..
Nipah virus: నిపా వైరస్ నుంచి కోలుకున్న నలుగురు.. శ్యాంపిల్ టెస్ట్‌లో నెగటివ్
Netaji | దేశానికి తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ అంటున్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

