Tamilnad Mercantile Bank | క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ.9వేల కోట్లు జమ.. బ్యాంక్ సీఈవో రాజీనామా
Tamilnad Mercantile Bank | ఉద్యోగుల అజాగ్రత్త కారణంగా దొర్లిన పొరపాటు సంస్థ సీఈవో రాజీనామాకు దారి తీసింది. ఇటీవలే చెన్నైకి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో అనూహ్యంగా రూ.9వేల కోట్లు జమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ బ్యాంకు సీఈవో (Bank CEO ) ఎస్ కృష్ణన్ ( S Krishnan) తన పదవికి రాజీనామా చేశారు.
Tamilnad Mercantile Bank | ఉద్యోగుల అజాగ్రత్త కారణంగా దొర్లిన పొరపాటు సంస్థ సీఈవో రాజీనామాకు దారి తీసింది. ఇటీవలే చెన్నైకి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో అనూహ్యంగా రూ.9వేల కోట్లు జమైన విషయం తెలిసిందే. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (Tamilnad Mercantile Bank) నుంచి ఈ సొమ్ము జమైంది. పది రోజుల కిందట జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ బ్యాంకు సీఈవో (Bank CEO ) ఎస్ కృష్ణన్ ( S Krishnan) తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల బ్యాంక్ ఎండీ, సీఈవో పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు రాజీనామాలో పేర్కొన్నారు. కృష్ణన్ రాజీనామాను బ్యాంక్ బోర్డు ఆమోదించింది. ఆర్బీఐ (RBI) నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకూ ఆయన ప్రస్తుత పదవుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ?
తమిళనాడు రాష్ట్రం పళని (Palani) నెయ్‌క్కారపట్టి (Neikarapatti)కి చెందిన రాజ్‌కుమార్ (Rajkumar) అనే వ్యక్తి చెన్నై (Chennai) కోడంబాక్కం (Kodambakkam)లో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దెకు కారు తిప్పుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాజ్‌కుమార్ సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. దానిని చూడగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (Tamilnad Mercantile Bank) నుంచి రూ.9,000 కోట్లు తన బ్యాంకు ఖాతాలోకి జమైనట్లు ఉంది. దీంతో ఒక్కసారిగా రాజ్‌కుమార్ షాక్ అయ్యాడు. అది నిజమా, కాదా అని తెలుసుకునేందుకు ఆ ఖాతా నుంచి తన స్నేహితుడికి రూ.21వేలు పంపాడు. దీంతో తన ఖాతాలో ఇంత మొత్తం ఉన్నది నిజమేనని నిర్ధారణకు వచ్చాడు. తన బ్యాంకు ఖాతాలో ఊహించని విధంగా రూ.9 వేల కోట్లు జమకావడంతో సంబరపడ్డాడు. అయితే రాజ్‌కుమార్‌కు ఆ ఆనందం కొద్దిసేపు మాత్రమే ఉంది. కొద్దిసేపటికే పొరపాటును గుర్తించిన సదరు బ్యాంకు రాజ్‌కుమార్ ఖాతా నుంచి పూర్తి డబ్బును తిరిగి (డెబిట్) తీసేసుకుంది. దీంతో ఈ అంశం కాస్తా చర్చనీయాంశమైంది.
BREAKING: ₹9000 crore deposited to a car driver bank account by Tamilnadu Mercantile Bank in Chennai. pic.twitter.com/VVjPbB9cgy
— Manobala Vijayabalan (@ManobalaV) September 21, 2023
Also Read..
Viral Video | పోలీసు వాహనంపై కూర్చొని అసభ్యకర రీతిలో యువతి రీల్స్.. అనుమతించిన అధికారిపై వేటు
Viral Video | టీవీ లైవ్ డిబేట్లో కొట్టుకున్న నేతలు.. వీడియో
London Tower Bridge | పైకిలేచిన వంతెన కిందకురాలేదు.. టవర్ బ్రిడ్జ్ వద్ద ఆసక్తికర ఘటన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

