Uttar Pradesh | దారుణం.. పెళ్లికి ముందే గర్భం దాల్చిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి ముందే గర్భం దాల్చిందని యువతిపై ఆమె తల్లి, సోదరుడు పెట్రోల్పోసి నిప్పంటించారు.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి ముందే గర్భం దాల్చిందని యువతిపై ఆమె తల్లి, సోదరుడు పెట్రోల్పోసి నిప్పంటించారు. ఈ ఘటన హపూర్ (Hapur) జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలోని నవాడా ఖుర్ద్ (Nawada Khurd) ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో ఆ యువకుడితో గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. ఈ విషయం బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందని ఆమె తల్లి, సోదరుడు యువతిని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 70 శాతం కాలిన గాయాలతోపడి ఉన్న యువతిని గుర్తించిన స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని యువతి తల్లి, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
Tamilnad Mercantile Bank | క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ.9వేల కోట్లు జమ.. బ్యాంక్ సీఈవో రాజీనామా
Viral Video | పోలీసు వాహనంపై కూర్చొని అసభ్యకర రీతిలో యువతి రీల్స్.. అనుమతించిన అధికారిపై వేటు
Viral Video | టీవీ లైవ్ డిబేట్లో కొట్టుకున్న నేతలు.. వీడియో
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

