Heavy Rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. చెన్నై (Chennai) సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్ పట్టు సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
#WATCH | Tamil Nadu: Rain lashes parts of Chennai city.
In view of the forecast of heavy rains, the Tamil Nadu government has declared a holiday for schools and colleges in Chennai, Tiruvallur, Kanchipuram and Chengalpattu districts today. pic.twitter.com/X4krhQKw4I
— ANI (@ANI) October 15, 2024
ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో సీఎం స్టాలిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా నేడు పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు (schools shut) ప్రకటించింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్ పట్టు సహా పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలను మూసివేయాలని ఆదేశించింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు ఈనెల 18 వరకూ వర్క్‌ఫ్రం హోం (work from home) అవకాశం కల్పించాల్సిందిగా సీఎం ఎంకే స్టాలిన్ ఐటీ సంస్థలకు సూచించారు.
#WATCH | Tamil Nadu: Rain lashes parts of Tiruvallur city; visuals from Ponneri area. pic.twitter.com/LpmESToXIT
— ANI (@ANI) October 15, 2024
అక్టోబర్ 12 నుంచి 16 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లో భారీ నుంచరి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ అత్యంత తీవ్మైన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
#WATCH | Tamil Nadu: Waterlogging witnessed in Koyambedu area of Chennai after incessant rainfall in the area. pic.twitter.com/4cvS9JjgsM
— ANI (@ANI) October 15, 2024
#WATCH | Tamil Nadu: Rain lashes parts of Chennai city.
(Visuals from Koyambedu area in Chennai) pic.twitter.com/kf2mfGz6fr
— ANI (@ANI) October 15, 2024
Also Read..
CM Hemant Soren: 81 స్థానాల్లో పోటీ చేస్తున్నాం: హేమంత్ సోరెన్
Election Dates: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన ఇవాళే
Modani | అదానీ-మోదీ.. మధ్యలో కెన్యా !