రాంచీ: జేఎఎం నేతృత్వంలోని కూటమి అన్ని 81 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్(CM Hemant Soren) తెలిపారు. జార్ఖండ్ ముక్తీ మోర్చా సెంట్రల్ కమిటీ మీటింగ్లో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధించనున్నట్లు సోరెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన జార్ఖండ్ అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్నది. అయితే ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనున్నది. జేఎంఎం సెంట్రల్ కమిటీ మీటింగ్లో వర్కర్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లతో కలిసి పాల్గొన్నానని, ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించామని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. తాము బీజేపీ తరహా కాదు అని, ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హేమంత్ సోరెన్ తెలిపారు. 2019లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. తమ కూటమే విజయం సాధించినట్లు సోరెన్ దంపతులు వెల్లడించారు.