న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మీడియా సమావేశం నిర్వహించనున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను(Election Dates) ప్రకటించనున్నది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వయనాడ్ లోక్సభ స్థానంతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 45 స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే వాటి తేడీలను కూడా ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనున్నది.