ఆదివారం 17 జనవరి 2021
National - Dec 03, 2020 , 08:44:14

నేడు అమిత్‌ షాతో పంజాబ్‌ సీఎం భేటీ

నేడు అమిత్‌ షాతో పంజాబ్‌ సీఎం భేటీ

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్‌, హర్యానా రైతు రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గురువారం పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ భేటీకానున్నారు. ఉదయం 9.30 గంటలకు రైతుల ప్రతినిధులతో జరిగే కీలకమైన సమావేశానికి ముందు భేటీ జరుగుతోంది. కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ మంగళవారం రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. బుధవారం సైతం తోమర్‌, గోయల్‌తో అమిత్‌ షా ఆయన నివాసంలో సమావేశమయ్యారు. గురువారం జరుగనున్న చర్చలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. రైతులు మాత్రం చట్టాలను వెనక్కి తీసుకోవడం మినహా మరే హామీలను ఒప్పుకునేది లేదని స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌ సీఎంతో అమిత్‌ షా భేటీ అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. రైతుల డిమాండ్లపైనే వీరిద్దరి మధ్య చర్చ జరుగునుందని సమాచారం.