రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా ‘యాస్’

న్యూఢిల్లీ : రాబోయే 12 గంటల్లో యాస్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావర శాఖ మంగళవారం అంచనా వేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను గత ఆరు గంటల్లో సుమారు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయువ్య దిశగా కదిలిందని పేర్కొంది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో పారాదీప్‌కు ఆగ్నేయ దిశగా 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. బుధవారం సాయంత్రం వరకు తుఫాను ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేసింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.
తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల వర్షం కురుస్తున్నది. తుఫాను నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి సోమవారం ఏపీ, ఒడిశా, బెంగాల్ ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌తో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కేంద్ర శాఖలు అన్ని విధాలుగా సహకరిస్తాయని హామీ ఇచ్చారు. సాధ్యమైనంత మేరకు విద్యుత్పత్తి కేంద్రాల్లో సరఫరా నిలిచిపోకుండా చూడాలని కోరారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లపై తుఫాను ప్రభావం, వాటి రక్షణపై చర్చించారు. రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు అధికంగా ఉంచుకోవాలని సూచించారు. అవసరమైతే తాత్కాలిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Missing: బార్బుడాలో కన్పించకుండా పోయిన మోహుల్ చోక్సీ
ఆచార్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్న చిరంజీవి..!
మాలి అధ్యక్షుడు సహా ప్రధానిని అరెస్టు చేసిన సైన్యం
దేశంలో 19.84 కోట్ల టీకాల పంపిణీ
సీలేరు నదిలో నాటుపడవల మునక.. ఒకరి మృతి.. 8 మంది గల్లంతు
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
చిత్తూరు జిల్లాలో విషాదం.. చెరువులో మూడు మృతదేహాలు
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1.96లక్షల కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- IMD
- Odisha
- West Bengal
- Yass Cyclone
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

