లాక్డౌన్ను జనం హాలిడేలా భావిస్తున్నారు: స్టాలిన్
చెన్నై: కరోనా గురించి జనం.. మాటల్లో వ్యక్తం చేస్తున్న భయాన్ని ఆచరణలో చూపించడం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. లాక్డౌన్ను పలువురు సెలవు (హాలిడే)లా భావిస్తూ, రోడ్ల మీద తిరుగుతున్నారని చెప్పారు. చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న స్టాలిన్ మాట్లాడుతూ.. ప్రజలు వ్యాధి భారిన పడకుండా ఉంటేనే కరోనా వ్యాప్తి తగ్గుతుందని అన్నారు. లాక్డౌన్ను అమలుచేస్తున్నది ప్రజల ప్రాణాలు కాపాడటానికేనని, ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను ఆసరాగా తీసుకుని బయటతిరగొద్దని సూచించారు.