e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News టాటా స్టీల్ మ‌హా ఔదార్యం.. కంపెనీపై కురుస్తున్న ప్ర‌శంస‌ల జ‌ల్లు

టాటా స్టీల్ మ‌హా ఔదార్యం.. కంపెనీపై కురుస్తున్న ప్ర‌శంస‌ల జ‌ల్లు

టాటా స్టీల్ మ‌హా ఔదార్యం.. కంపెనీపై కురుస్తున్న ప్ర‌శంస‌ల జ‌ల్లు

జెంషెడ్‌పూర్‌: టాటా స్టీల్ కంపెనీ అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకున్న‌ది. క‌ష్ట‌కాలంలో మాన‌వ విలువ‌లకు మ‌ణిహారంగా నిలిచింది. కోవిడ్‌తో చ‌నిపోయిన త‌మ సంస్థ ఉద్యోగ కుటుంబీకుల‌కు.. స‌ద‌రు ఉద్యోగి రిటైర్మెంట్ వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు ఆ ఉద్యోగి నెల జీతాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు ఇవ్వ‌నున్న‌ది. అంటే ఉద్యోగి 60 ఏళ్ల వ‌య‌సు వ‌ర‌కు ఆ ఉద్యోగి కుటుంబ‌స‌భ్యులకు నెల జీతం ఇవ్వ‌నున్నారు. ఆ ఉద్యోగి చివ‌రి సారి ఎంత జీతం తీసుకున్నాడో.. ఆ జీతాన్ని ప్ర‌తి నెల వారి కుటుంబ‌స‌భ్యుల‌కు ఇవ్వ‌నున్న‌ట్లు టాటా స్టీల్ చెప్పింది. కోవిడ్‌తో మృతిచెందిన ఉద్యోగుల‌కు సామాజిక భ‌ద్ర‌త ఇవ్వ‌డ‌మే కాదు.. వారి కుటుంబాల‌కు భ‌రోసా ఇవ్వ‌డం కూడా ఆ కంపెనీ బాధ్య‌త‌గా తీసుకున్న‌ది. సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసిన ఓ స్టేట్‌మెంట్ ద్వారా టాటా స్టీల్ కంపెనీ ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది.

ఇక కంపెనీలో ప‌నిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్‌కు కోవిడ్ సంక్ర‌మించి, ఆ వ్య‌క్తి ఒక‌వేళ మ‌ర‌ణిస్తే.. ఆ ఉద్యోగి పిల్ల‌ల చ‌దువుల‌ను మొత్తం కంపెనీ భ‌రించ‌నున్న‌ది. నెల జీతానికి ఇది అద‌నం. పిల్ల‌లు ఇండియాలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి అయ్యేంత వ‌ర‌కు ఆ మొత్తం ఖ‌ర్చును టాటా స్టీల్ కంపెనీ పెట్టుకోనున్న‌ది. జెంషెడ్‌పూర్‌కు చెందిన టాటా స్టీల్ కంపెనీ చేసిన ప్ర‌క‌ట‌న నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్న‌ది. ఆ కంపెనీపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తున్న‌ది. టాటా స్టీల్‌ను అమితంగా గౌర‌విస్తాని ఓ ట్విట్ట‌ర్ యూజ‌ర్ పోస్టు చేశారు. కార్పొరేట్ ప్ర‌పంచానికి ర‌త‌న్ టాటా ఓ స్పూర్తిగా నిలిచార‌ని మ‌రో యూజ‌ర్ ట్వీట్ చేశారు. టాటా త‌ర‌హాలో మ‌రో సంస్థ ఆలోచింద‌ని ఒక‌ర‌న్నారు. కొంద‌రు ర‌త‌న్ టాటాకు సెల్యూట్ చేస్తూ ఎమోజీలు పెట్టారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టాటా స్టీల్ మ‌హా ఔదార్యం.. కంపెనీపై కురుస్తున్న ప్ర‌శంస‌ల జ‌ల్లు

ట్రెండింగ్‌

Advertisement