Punjab CM : ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో జరిగిన ఈ సమావేశం పలువురు రాజకీయ నాయకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ ఎందుకు సమావేశమయ్యారనే దానిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్థానంలో కొత్త వ్యక్తిని సీఎంగా నియమించబోతున్నారనే ప్రచారం జరిగింది.
ముఖ్యంగా రాజౌరి గార్డెన్ నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆప్ సమావేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లో మాదకద్రవ్యాలను నియంత్రించడంలో, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా నెలనెలా ప్రతి మహిళకు రూ.1000 అందజేయడంలో ఆప్ సర్కారు విఫలమైందని, ఈ వైఫల్యాలన్నింటిని భగవంత్ మాన్‌పై నెట్టేసి ఆయనను పదవీచ్యుతుడిని చేయాలని కేజ్రీవాల్ భావిస్తున్నారని ఆరోపించారు. భగవంత్ మాన్‌ను గద్దె దించి, పంజాబ్ సీఎం పీఠంపై కూర్చోవాలనేది కేజ్రీవాల్ ఉపాయమని అన్నారు.
సమావేశం అనంతరం బయటికి వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను సిర్సా కామెంట్స్‌పై ప్రశ్నించగా.. ఆయన బిగ్గరగా నవ్వారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ‘వాళ్లు (బీజేపీ నేతలు) వాళ్లకు ఇష్టం వచ్చింది చెప్పుకోనివ్వండి’ అన్నారు. పంజాబ్‌లో అర్హురాలైన ప్రతి మహిళ రూ.1000 అందుకోబోతోందని హామీ ఇచ్చారు. అదేవిధంగా పంజాబ్‌లో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన వ్యాఖ్యలపై కూడా భగవంత్ మాన్ స్పందించారు.
కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా తనతో 20 మంది ఆప్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని గత మూడేళ్లుగా చెబుతున్నారని, ముందుగా ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి ఎన్ని సీట్లో గెలిచిందో లెక్కబెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఢిల్లీలో వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. వరుసగా గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అయితే ఈసారి ఓటు షేర్‌ను మాత్రం పెంచుకోగలిగింది.
Chattishgarh Elections | ఛత్తీస్‌గఢ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
Donald Trump | ఆ లోగా బందీలందరినీ విడిచిపెట్టకపోతే.. హమాస్‌కు డొనాల్డ్ ట్రంప్ డెడ్‌లైన్
Amanatullah Khan | పోలీసులపై దాడి కేసు.. ఆప్ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం
Bandla Ganesh | నోటి దూలతో సమస్య రావడం దారుణం.. విశ్వక్సేన్ లైలా వివాదంపై బండ్ల గణేశ్
Balkampet Temple | బల్కంపేట ఆలయంలో నకిలీ శీఘ్రదర్శన టికెట్లు.. ఉద్యోగిపై వేటు
Peanuts With Skin | పల్లీలను పొట్టుతో తినాలా..? పొట్టు తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?