Priyanka gandhi | తిరువనంతపురం : కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉదయం 9 గంటల వరకు ఆమె 24 వేల ఓట్ల లీడ్లో ఉన్నారు. బీజేపీ నుంచి పోటీ చేసిన నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తి స్థాయి ఫలితం వెలువడే అవకాశం ఉంది. వయనాడ్లో ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఇక ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 16 మంది బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్కు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేశారు.
ఇవి కూడా చదవండి..
Champai Soren | జార్ఖండ్లో ముమ్మాటికి గెలిచేది బీజేపీయే: చంపయీ సోరెన్
Jharkhand | జార్ఖండ్లో అధికార మార్పిడి ఖాయమా..! ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేనా..?