Jharkhand | జార్ఖండ్‌లో అధికార మార్పిడి ఖాయమా..! ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యేనా..?
Jharkhand | జార్ఖండ్‌లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా - కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి భవితవ్యం మరికాసేపట్లో తేలనుంది.
Jharkhand | రాంచీ : జార్ఖండ్‌లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా – కాంగ్రెస్ కూటమి, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి భవితవ్యం మరికాసేపట్లో తేలనుంది. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికే అధికారం దక్కే అవకాశం ఉందని అంచనా వేశాయి.
జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 41. అధికార పక్షం.. జేఎంఎం 43, కాంగ్రెస్ 30, ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) నాలుగు చోట్ల పోటీ చేయగా, ప్రతిపక్ష ఎన్డీఏ కూటమి.. బీజేపీ 68, ఏజేఎస్‌యూ 10, జేడీయూ రెండు, లోక్‌జన్‌శక్తి(రామ్ విలాస్) పార్టీ ఒక చోట పోటీ చేశాయి. ఎన్డీఏ కూటమి 42 నుంచి 48 స్థానాల్లో, జేఎంఎం 25 -30 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యే అవకాశం ఉందని జార్ఖండ్ ముక్తి మోర్చా జనరల్ సెక్రటరీ, అధికార ప్రతినిధి సుప్రీయో భట్టాచార్య పేర్కొన్నారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ఎన్డీఏ కూటమికి ప్రజలు వ్యతిరేక తీర్పు ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. సీఎం హేమంత్ సోరెన్ కూడా తమ పార్టీ గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు. తప్పకుండా అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు హేమంత్ సోరెన్.
ఇవి కూడా చదవండి..
Adani | కార్పొరేట్లకు అదానీ సెగ.. పెట్టుబడులపై పునరాలోచనలో విదేశీ మదుపరులు
Nana Patekar | యానిమల్‌లో అతను తప్ప అంతా ఓవరాక్షన్ చేశారు: నానాపటేకర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

