రాంచీ: జార్ఖండ్‌లో గెలిచేది బీజేపీయేనని, అందులో ఎలాంటి సందేహం లేదని మాజీ సీఎం, ఆ పార్టీ నేత చంపయీ సోరెన్ (Champai Soren) అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ-ఎన్డీయేనని స్పష్టం చేశారు. ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని చెప్పారు. ఇది మరో గంట, గంటన్నరలో తేలనుందని వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని పార్టీయే నిర్ణయిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు ఆ నిర్ణయం ఉంటుందని చెప్పారు. బంగ్లాదేశీల అక్రమ వలసలు రాష్ట్రానికి అతిపెద్ద సమస్యగా మారాయన్నారు. అక్రమ వలసదారుల జనాభా చాలా వేగంగా పెరుగుతూ వస్తున్నదని తెలిపారు. ఆయన సెరైకేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలసిందే.
జార్ఖండ్‌లోని 81 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 13న మొదటి దశ, గత బుధవారం రెండో, ఆఖరి విడత పోలింగ్ జరిగింది. అయితే రాష్ట్రంలో హోరాహోరీ పోరు నెలకొన్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎన్డీయేకు 39, ఇండియా కూటమికి 38 సీట్లు రానున్నాయి. 81 సీట్లున్న జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు అవసరం. కాగా, యూపీలో 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 7 స్థానాలను బీజేపీ కూటమి గెల్చుకుంటుందని పలు సంస్థలు అంచనా వేశాయి.
#WATCH | Seraikela Kharsawan: Ahead of the counting of votes for #JharkhandElection2024, BJP candidate from Saraikela assembly constituency & former CM, Champai Soren says, “BJP is going to win, there is no doubt. BJP-NDA is going to form the government…People have voted in… pic.twitter.com/jIV3uXbiBk
— ANI (@ANI) November 23, 2024