Maharashtra Election Results | ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మహాయుతి, మహావికాస్ అఘాడీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. నవంబర్ 20వ తేదీన ఒకే విడుతలో జరిగిన ఎన్నికల్లో భారీగా 65.1 శాతం పోలింగ్ నమోదైంది. 1995 తర్వాత ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. అయితే ఎప్పుడైనా పోలింగ్ భారీగా నమోదు అయిందంటే అధికార పార్టీకి గడ్డుకాలమే అనే సంకేతాలు వెలువడుతాయి. మళ్లీ అధికారం చేపట్టే అవకాశాలు లేనట్లే అని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తారు. ఈ నేపథ్యంలో మహాయుతి, మహావికాస్ అఘాడీ మధ్య తీవ్రమైన పోటీ ఉందని అంచనా వేయొచ్చు. ఇక ఫలితాలు వెల్లడైతే కానీ ఈ అంచనాను నిర్ధారించలేము. కొన్నిసార్లు ఈ అంచనాలు తలకిందులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
మహారాష్ట్రలో 1995లో 71.5 శాతం పోలింగ్ నమోదైంది. 2004, 2014 ఎన్నికల్లో 63.4 శాతం, 1999లో 61 శాతం, 2009లో 59.7 శాతం, 2019లో 61.4 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 65.1 శాతం పోలింగ్ నమోదు కాగా, నక్సల్స్ ప్రభావిత జిల్లా గడ్చిరోలిలో అత్యధికంగా 70 శాతం పోలింగ్ నమోదైంది. నాసిక్, ముంబైలో కేవలంఓ 54 శాతం మాత్రమే నమోదైంది. 2019 ఎన్నికల్లతో పోల్చితే పోలింగ్ శాతం కొంత మేర పెరిగింది. నాటి ఎన్నికల్లో 50.67 శాతం పోలింగ్ నమోదైంది.
288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మహాయుతినే మళ్లీ అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 150 స్థానాలకు పైగా మహాయుతి గెలిచే అవకాశం ఉందని తెలిపాయి. మహావికాస్ అఘాడీ 125 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.
మహాయుతిలో బీజేపీ, శివసేన(ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) భాగస్వామ్యం కాగా, మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ(శరద్ పవార్) భాగస్వాములు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉండగా, మెజార్టీ మార్కు 145. అధికారంలో ఉన్న మహాయుతిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. విపక్ష ఎంవీఏ(మహావికాస్ అఘాడీ)లోని కాంగ్రెస్ 101, ఉద్ధవ్ థాకరే 95, ఎన్సీపీ(శరద్ పవార్) 86 సీట్లలో పోటీ చేశారు. ఇక బీఎస్పీ 237, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి.
ఇవి కూడా చదవండి..
Priyanka Gandhi | మరికాపేపట్లో తేలనున్న ప్రియాంక గాంధీ భవితవ్యం..!
MLAs Defection | ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై.. నిర్దిష్ట కాలమంటే 3 నెలలే!