Priyanka Gandhi | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఆమె పోటీ చేశారు. తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేశారు. ఈ ఉప ఎన్నిక ఫలితం మరికాసేపట్లో వెలువడనుంది.
వయనాడ్‌లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తిస్థాయి ఫలితం వెలవడే అవకాశం ఉంది. నవంబర్ 13వ తేదీన వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఇక రాహుల్ గాంధీ రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
వయనాడ్, నాందేడ్ ఎంపీ స్థానాలతో పాటు 14 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఫలితాలు కూడా ఇవాళ్నే వెలువడనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి.
ఇవి కూడా చదవండి..
Elections Results | నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
MLAs Defection | ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై.. నిర్దిష్ట కాలమంటే 3 నెలలే!
Adani | అదానీ కహానీ వెనుక భారీ కుట్ర?.. ‘సోలార్ స్కామ్’లో కొత్త కోణం..