న్యూఢిల్లీ: ఈస్టర్ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు పునరుత్థానం చెందిన రోజును ఈస్టర్గా జరుపుకుంటామని, ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో ఉత్సాహం, ఆరోగ్యం, శాంతి సామరస్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
క్రీస్తు బోధనలు ప్రేమ, ఆప్యాయతను పెంచాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. క్షమ, త్యాగం, కరుణ, సత్యానికి ఏసుక్రీస్తు ప్రతిరూపం అని చెప్పారు. గుడ్ ఫ్రైడేనాడు శిలువ వేసిన తర్వాత క్రీస్తు పునరుత్థానం చెందిన రోజును ఈస్టర్గా జరుపుకుంటామని రాష్ట్రపతి పేర్కొన్నారు.
Easter greetings to all! The resurrection of Jesus Christ, celebrated across the world, gives us hope and happiness; reaffirms our faith in innate goodness of humanity. May the teachings of Jesus Christ strengthen the bonds of love, affection and harmony in our society!
— President of India (@rashtrapatibhvn) April 4, 2021
ప్రేమ, దయ, క్షమాగుణానికి ప్రతిరూపం ఏసుక్రీస్తు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఏసుక్రీస్తు మానవులకు మోక్ష మార్గాన్ని చూపారని పేర్కొన్నారు. ఈ పండుగ మన జీవితంలో ఆరోగ్యం, శాంతి, సామరస్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. దేశప్రజలందరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
Let us celebrate #Easter by being compassionate towards all human beings. May this festival bring good health, peace and harmony in our lives. #Easter2021
— Vice President of India (@VPSecretariat) April 4, 2021
దేశ ప్రజలందరికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. జీసెస్ క్రైస్ట్ సామాజిక సాధికారతను నొక్కి వక్కాణించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మనమందరం జీసస్ క్రైస్ట్ పవిత్ర బోధనలను స్మరించుకుందామని ప్రధాని ట్వీట్ చేశారు.
Greetings on Easter!
— Narendra Modi (@narendramodi) April 4, 2021
On this day, we remember the pious teachings of Jesus Christ. His emphasis on social empowerment inspires millions across the world.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..