Prashant Kishor : జన్ సూరజ్ పార్టీ (Jan Suraj Party) అధ్యక్షుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు రేవంత్ రెడ్డి ఎవరని, బీహార్ (Bihar) లో ఆయనకు ఏం పని అని ప్రశ్నించారు. ఆయన బీహార్‌లో ఎక్కడికి వెళ్లిle అక్కడి ప్రజలు కర్రలతో తరిమి కొడుతారని అన్నారు.
బీహార్ రాజకీయాల్లో రేవంత్ జోక్యాన్ని ప్రశాంత్ కిషోర్ తప్పుబట్టారు. ‘అసలు రేవంత్ రెడ్డి ఎవరు..? బీహార్‌లో ఆయనకు ఏం పని..? బీహార్‌తో రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటి..? రేవంత్ రెడ్డి స్థాయి ఏమిటి..? అని ప్రశాంత్ కిశోర్ ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి ఒకవైపు బీహార్ ప్రజలను అవమానించేలా మాట్లాడుతూ.. మరోవైపు అదే బీహార్‌కు ఓట్లు అడగడానికి ఎలా వస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్ రెడ్డి వైఖరిపై పీకే తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. బీహార్‌ను అవమానించే నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, ఇది రాహుల్‌గాంధీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని అంటూ రాహుల్‌గాంధీపై కూడా విమర్శలు చేశారు. ఓట్ల చోరీ అంటూ రాహుల్‌గాంధీ ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, తప్పుడు ఆరోపణలంటూ మోదీ.. రాహుల్‌గాంధీని విమర్శిస్తున్నారని, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మల్లించేందుకు ఈ నాటకాలని ఆరోపించారు.