PM Modi | బీజేడీ పాలనలో పూరీ జగన్నాథుడి ఆలయం సురక్షితంకాదు : ప్రధాని మోదీ
PM Modi | ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగన్నాథ ఆలయాన్ని (Jagannath temple) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) సోమవారం సందర్శించారు.
PM Modi | ఒడిశాలోని పూరీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగన్నాథ ఆలయాన్ని (Jagannath temple) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ‘పూరీలో మహాప్రభు జగన్నాథ్‌ను దర్శించుకున్నాను. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉంటాయి. ప్రగతి పథంలో కొత్త శిఖరాలను మార్గనిర్దేశం చేస్తాయి’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఒడిశాలోని అధికార బీజేడీ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు చేశారు. బీజేడీ పాలనలో పూరీలోని 12వ శతాబ్దపు జగన్నాథ్ ఆలయం సురక్షితం కాదన్నారు. గత ఆరేళ్లుగా రత్న భండార్ (Ratna Bhandar) తాళాలు కనిపించడం లేదన్నారు.
Prayed to Mahaprabhu Jagannath in Puri. May His blessings always remain upon us and guide us to new heights of progress. pic.twitter.com/jom9EBq9Zg
— Narendra Modi (@narendramodi) May 20, 2024
ఏమిటీ రత్న భండార్..?
ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రం కిందిభాగంలో ఈ రత్న భండాగారం ఉంటుంది. గతంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలోనే భద్రపరిచారు. వీటి విలువ వెలకట్టలేనిదని అంచనా. ఆ భండార్ తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే భండాగారంలోని కీలక విభాగ తాళాలు మాయం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read..
Rahul Gandhi | రాయ్‌బరేలిలోని పిపలేశ్వర హనుమాన్ ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు
Delhi Metro | ఢిల్లీ మెట్రోలో యువతి బెల్లీ డ్యాన్స్.. VIDEO
Rave Party | బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

