NITI Aayog | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన నీతి ఆయోగ్ (NITI Aayog) 10వ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం ‘వికసిత రాజ్యం కోసం వికసిత భారత్@2047’ అనే ఇతివృత్తంతో జరుగుతోంది. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఇవాళ ఉదయం 10 గంటలకు భేటీ ప్రారంభమైంది.
ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు (Chief Ministers) హాజరయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు, ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ఈ భేటీ జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సమన్వయంతో ఆర్థిక అభివృద్ధి, సహకార సమాఖ్య విధానాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించింది.
Also Read..
Shashi Tharoor | ఉగ్రవాదం విషయంలో భారత్ మౌనంగా ఉండదు : శశి థరూర్
Jharkhand | జార్ఖండ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
MBBS Student | వైద్య విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి..