MBBS Student | వైద్య విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి..
మహారాష్ట్రలోని సాంగ్లీలో దారుణం చోటుచేసుకున్నది. మత్తు మందు ఇచ్చి వైద్య విద్యార్థినిపై (MBBS Student) సహచరులే సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముంబై: మహారాష్ట్రలోని సాంగ్లీలో దారుణం చోటుచేసుకున్నది. మత్తు మందు ఇచ్చి వైద్య విద్యార్థినిపై (MBBS Student) సహచరులే సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని బెళగావికి చెందిన బాధితురాలు (22) మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నది. ఈ నెల 18న రాత్రి 10 గంటల తన తోటి మెడికల్ విద్యార్థులతో కలిసి సినిమా చూడాలనుకున్నది. అయితే వారిలో ఒకరు అంతకుముందే ఆమెను తన ప్లాట్కు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరో మెడికల్ స్టూడెంట్తోపాటు ఓ యువకుడు ఉన్నాడు. నలుగురు కలిసి మద్యం సేవించారు. మత్తులో ఆమెకు స్పైక్డ్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన తర్వాత బాధితురాలు స్పృహ కోల్పోయింది.
దీంతో ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘోరాన్ని ప్రశ్నించడంతో.. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో భారత న్యాయ సంహిత సెక్షన్ కింద సామూహిక లైంగికదాడి, ఇతర అభియోగాల కింద నిందితులపై కేసు నమోదుచేశారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. వారు పుణె, షోలాపూర్, సాంగ్లికి చెందినవారని, అంతా 20 నుంచి 22 ఏండ్ల లోపువారేనని పోలీసులు వెల్లడించారు. న్యాయస్థానం వారిని మే 27 వరకు పోలీసు కస్టడీకి అప్పగించిందని తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

