Patna firing : బీహార్ (Bihar) రాజధాని పట్నా (Patna) లో కాల్పుల కలకలం చెలరేగింది. కాంకర్ బాగ్ (Kankarbagh) ఏరియాలోని ఓ ఇంటి ఆవరణలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఒక భూ వివాదం విషయంలో చోటుచేసుకున్న గొడవ కాల్పుల (Firing) కు దారి తీసింది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు (Police), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (Special Task Force) సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
పోలీసుల రాకను గమనించిన దుండగులు తప్పించుకునేందుకు సమీపంలోని బిల్డింగులోకి వెళ్లారు. దాంతో పోలీసులు ఆ బిల్డింగును చుట్టుముట్టారు. దుండగులను లొంగిపోవాలని ఆదేశించారు. అనంతరం నలుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పారిపోయారు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.
ఘటనపై ప్రతిపక్ష ఆర్జేడీ అగ్ర నాయకుడు, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సీఎం నితీశ్ కుమార్‌కు ప్రజల బాగోగులు పట్టిలేవని ఆరోపించారు.
#WATCH | Bihar: The firing took place in Patna’s Kankarbagh area today around 2 pm. Four criminals opened fire outside a house. After the firing, all the criminals went into hiding inside a house nearby. STF has reached the spot along with the Police. The force has surrounded the… pic.twitter.com/9R1H7hLDLb
— ANI (@ANI) February 18, 2025
Ashley clair | ఆయనతో సంబంధం అలా మొదలైంది.. ఎలాన్ మస్క్‌తో రిలేషన్‌పై అష్లీ క్లెయిర్
USA | అక్కడ సజీవంగా 360 ఏళ్ల వ్యక్తి.. 200 ఏళ్లు దాటినవాళ్లూ 2 వేల మంది..!
Health Tips | నిద్రలో కాళ్లూచేతులు పట్టేస్తున్నాయా.. అయితే ఇలా చేయండి!
Plane Crash | తలకిందులైంది.. రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడిన విమానం
High Court | హైడ్రా చర్యలు చట్టవ్యతిరేకం.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం: హైకోర్టు